![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 లో అప్పుడే ఇద్దరు ఎలిమినేషన్ అయ్యారు. మొదటి వారం శ్రష్టి వర్మ ఎలిమినేషన్ అవ్వగా రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేషన్ అయ్యాడు. నిజానికి ప్రియ కానీ ఫ్లోరా కానీ ఎలిమినేట్ అవుతారని ఎక్కువమంది ఆడియన్స్ అనుకున్నారు. కానీ అందరికి షాకిస్తూ మర్యాద మనీష్ ని బయటికి పంపించేశాడు బిగ్‌బాస్. ఇక బయటకొచ్చిన తర్వాత బిగ్‌బాస్ బజ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు మర్యాద మనీష్.
హౌస్‌లో ఫైర్ ఎవరు ఫ్లవర్ ఎవరని మర్యాద మనీష్‌ని శివాజీ అడిగాడు. డీమాన్ పవన్ ఫ్లవర్ అంటూ మనీష్ చెప్పాడు. అలానే టాప్-7 మెటీరియల్ కానీ ఎందుకో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో వెళ్లిపోతారని నాకు కొడుతుందంటూ మనీష్ అన్నాడు. తనూజ గౌడ కూడా ఫ్లవరే.. తన వల్ల గేమ్ ఇప్పటికి ఇంపాక్ట్ అవ్వలేదంటూ మనీష్ అన్నాడు.ఇమ్మాన్యుయేల్ ఫైర్.. ఇతను మూడు విషయాలు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు సర్.. ఒకటి ఎంటర్‌టైన్‌మెంట్.. సెకెండ్ ఎమోషన్స్.. థర్డ్ టాస్క్.. ఇంకేం కావాలి సర్ అంటూ ఇమ్మాన్యుయల్ ని మనీష్ పొగిడేశాడు.
హౌస్ నుంచి బయటకొచ్చాక ప్రియ గురించి మీ అభిప్రాయమేంటని శివాజీ అడుగగా. నేను అయితే తనని నెక్స్ట్ వీక్ నామినేట్ చేద్దామనే అనుకున్నాను. వీళ్లిద్దరూ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ తర్వాత అంటూ శ్రీజ, ప్రియ గురించి ఏదో చెప్పాడు మనీష్. ఇంతలో మీ దగ్గర మాటలు చాలా ఉన్నాయని నాకు తెలుసు కానీ మీరు మాట కూడా జారారు.. ఎందుకో మనీష్ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్‌గా బిహేవ్ చేస్తున్నాడనిపించిందంటూ శివాజీ అన్నాడు. నేనూ నోటీస్ చేశానంటూ మర్యాద మనీష్ ఒప్పుకున్నాడు మర్యాద. ఇక పాయింట్ నెంబర్ వన్.. మీ దగ్గర యూనిటీ ఉందా.. ఉంటే ఎవరెవరితో ఎవరెవరికి ఉందని శివాజీ ప్రశ్నించాడు. అలానే మీరు, శ్రీజ, ప్రియ.. మీరు ఇంత చేయటం వల్లే ఆయన్ని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారంటూ శివాజీ అన్నాడు. తను యాక్చువల్లీ ఫైర్‌గా ఉండే.. మేమే వైల్డ్ ఫైర్ చేశామని ఇప్పుడే రియలైజ్ అవుతున్నామంటూ మనీష్ అన్నాడు. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి అన్నాడనేది తెలియదు. మరి మర్యాద మనీష్ ఏం మాట్లాడాడో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.
![]() |
![]() |